డ్రైవర్ రాముడు టీజర్ విడుదల

Date:22/05/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరో గా  రాజ్ స‌త్య దర్శకత్వంలో  సినిమా పీపుల్ పతాకం పై మాస్టర్  ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రామూడు’. ఇటీవలే మూడవ షేడ్యూలు  పూర్తి  చేసుకున్న ఈ చిత్రం  ఇటీవలే విడుదలైన మొదటి ప్రచార చిత్రం సినిమా అంచనాలను రేటింపు చేసింది. ఇప్పుడు సినిమా కు సంభందించి మొదటి టీజర్ ను విడుదల చేసారు. సక్సెస్ ఫుల్ హీరో సుధీర్ బాబు డ్రైవర్ రాముడు మొదటి టీజర్ ను విడుదల చేసారు.తర్వాత సుధీర్ బాబు మాట్లాడుతూ “నాకు కమెడియన్స్ లో నచ్చిన నటుడు షకలక శంకర్. ఒక్క  సినిమా తో షకలక శంకర్  కమెడియన్ గా ఉన్నాడు అంటే ఆ చిత్రం లోని కామెడీ ఖచ్చితంగా బాగుంటుంది, ఇప్పుడు తాను హీరో గా వస్తున్నాడు అంటే ఈ చిత్రం లో కామెడీ అద్భుతంగా ఉంటుంది అని అర్ధం అయింది. ఈ డ్రైవర్ రాముడు చిత్రం టీజర్ నేను విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. నిర్మాతలైన వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ లకు మరియు దర్శకుడు రాజ్ స‌త్య కి నా శుభాకాంక్షలు. డ్రైవర్ రాముడు సినిమా మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ… ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్‌లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంక‌ర్ మార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది. మా సినిమా టీజర్ ను సుధీర్ బాబు గారు రిలీజ్ చేయటం మా అదృష్టం. సినిమా ప్రేక్షకులందరికీ నచుతుంది”  అని తెలిపారు.  నిర్మాతలు మాట్లాడుతూ “మా డ్రైవర్ రాముడు సినిమా టీజర్ ని సుధీర్ బాబు గారు విడుదల చేయటం మా అదృష్టం. వారు టీజర్ ని చూసి చాలా బాగుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని కొనియాడారు. ఈ సినిమా విడుదల సమయానికి సుధీర్ బాబు గారికి ప్రత్యేకమైన షో వేస్తాము.  త్వరలోనే సినిమా విడుదలకు అని కార్యక్రమాలు పూర్తి చేస్తాము” అని తెలిపారు.  ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.
Tags: Driver released by Ramu Teaser

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed