డ్రైవర్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఉప్పల్ ముచ్చట్లు:

ఆటో రిక్షా, మోటర్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలిని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ గౌడ్ అన్నారు.హైదరాబాద్ మల్లాపూర్ జాన్సన్ హై స్కూల్ లో తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా వాక్సినేషన్ కేంద్రంలో ఉప్పల్ ఆర్టీఓ కరోనా వాక్సినేషన్ కేంద్రం నోడల్ అధికారి పుల్లెంల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా 5 రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే ఉద్దేశంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిందని తెలిపారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, అపోహలు పెట్టుకోకుండా టీకా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో నేటి వరకు దాదాపు మూడు వేల వ్యాక్సినేషన్ లు జరిగాయన్నారు, వ్యాక్సిన్ ప్రక్రియ శనివారం కూడా కొనసాగుతుందని ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు ఆటో రిక్షా డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్, లైట్ మోటార్ , హెవీ మోటార్ వెహికిల్ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Drivers should take advantage of the vaccination drive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *