శేషాచలం లో డ్రోన్ పరిశీలన

-టాస్క్ ఫోర్స్,  అటవీశాఖ ప్రయోగం
Date:11/05/2018
తిరుపతి  ముచ్చట్లు:
అరుదైన ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిర్మూలించే దిశగా టాస్క్ ఫోర్స్ ముందుకెళ్తుంది.  ఈ క్రమంలో  శేషాచలం అడవిలోని తిరుమల సమీపంలోని కె. పి డ్యామ్, అన్నదమ్ముల బండ వద్ద టాస్క్ ఫోర్స్,  అటవీశాఖ ఆధ్వర్యంలో డ్రోన్ పరిశీలన జరిగింది.  ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ హరినాథ బాబు మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఐజి శ్రీ డా ఎం కాంతారావు గారు, ఎస్పీ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్,  అటవీశాఖ సంయుక్తంగా స్మగ్లర్ల జాడలను గుర్తించేందుకు డ్రోన్లను పరిశీలించామని చెప్పారు.  టెక్నాలజిని ఉపయోగించుకుని మరింత పటిష్టంగా అక్రమ రవాణాను అరికడుతామని తెలిపారు. స్మగ్లింగ్ అరికట్టాలంటే అటవిలోకి ప్రవేశించి,  బయటకు వచ్చే మార్గాలు,   లోడింగ్ ప్రాంతాలతో పాటు దుంగలను దాచే ప్రదేశాలు,  స్మగ్లర్లకు ఆహారం సరఫరా చేసే వారితో పాటు,  దట్టమైన అటవీ ప్రాంతం,  వాలు ప్రాంతంలో స్మగ్లర్లు ను గుర్తించేందుకు డ్రోన్లను పరిశీలించామని చెప్పారు. పూర్తి స్థాయిలో డ్రోన్ల వలన స్మగ్లింగ్ కార్యాకలపాలను అరికడుతామని దీమ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అడిషనల్ పీసిసిఎఫ్ బి. కె సింగ్, డీఎఫ్వో నాగార్జున రెడ్డి,  టాస్క్ ఫోర్స్ ఆర్ఐ మురళీ,  ఎఫ్ఆర్వో లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
Tags: Drone observation in infantile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *