Dropped tourism!

పడకేసిన పర్యాటకం!

-ఐదు నెలల్లో రూ.22.76 కోట్ల ఆదాయం నష్టం
-భారీగా తగ్గిపోయిన స్వదేశీ, విదేశీ సందర్శకులు
-జూన్‌ నుంచి పర్యాటక కేంద్రాలు ఫలితం లేదు
-ఇదే పరిస్థితి కొనసాగితే వేతనాలకు కష్టమే

Date:19/09/2020

తిరుపతి ముచ్చట్లు:

దేశీయ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన జిల్లాలోని పర్యాటక కేంద్రాలు వెలవెలపోతున్నాయి. నిత్యం సందడిగా కనిపించే ప్రాంతాల్లో నిర్మూణుష్యం నెలకొంది. ఆదాయంలో అగ్రగామిగా నిలచిన యూనిట్లు ఇప్పుడు సిబ్బందికి వేతనాలకు సరిపడా ఆదాయమైనా సమకూర్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కోవిడ్‌ కారణంగా పర్యాటకశాఖ కుదేలైంది. గత పరిస్థితులను మళ్లీ తీసుకురావడంతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నప్పటికి ఆదాయంలో మళ్లీ గాడిలో పడటం ఎప్పుడు అన్నది ప్రశ్నార్ఘకంగా మారింది. జిల్లాలోని పర్యాటక, పుణ్యక్షేత్రల సందర్శనకు వచ్చేవారి సంఖ్య గత మూడేళ్లుగా ఊహించని విధంగా పెరిగింది. తిరుమల, తిరుచానారు, శ్రీనివాసమంగాపురం ఆలయాలను దర్శించే పర్యాటకుల సంఖ్య ప్రథమస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో పర్యాటక ప్రాంతాలది. హార్సిలీహిల్స్, కైలాసనాధకోన, తలకోన, శ్రీకాళహస్తీ ప్రాంత్చా కు సందర్శకులు పొటెత్తేవారు.
×కళతప్పిన పర్యాటకం
జిల్లాలో పర్యాటకశాఖకు తిరుమల, తిరుపతి రవాణా, కైలాసనాధకోన, పులిగుండు, హార్సిలీహిల్స్, శ్రీకాళహస్తీ, పలమనేరు, కుప్పం, పుత్తూరు, చంద్రగిరి సౌండ్‌ అండ్‌ లైటింగ్‌, తలకోన యూనిట్లు ఉండగా వాటిలో పులిగుండు, కుప్పం,పలమనేరు హ్గటళ్ల యూనిట్లను గత ప్రభుత్వం ప్రయివేటుకు అప్పగించింది. కుప్పం ఇంకా ప్రారంభంకాలేదు. హైవే అభివృద్దిలో భాగంగా పుత్తూరు హ్గ్రటల్‌ తొలగించారు. ఆదాయంలో అగ్రస్థానం తిరుపతి రవాణా విభాగానిదే. తర్వాత బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ ఆదాయం ఏటా పెరుగుతోంది. తిరుపతి రవాణా విభాగం కూడా లక్ష్యాన్ని మించిన ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్లన్నీ ఆదాయంలో పడకేశాయి. సందర్శకలు రాకపోవడంతో ఆదాయంపై తీవప్రభావం చూపుతోంది. అయితే తిరుపతిలో కోవిడ్‌ కేంద్రాలలో చికిత్సపొందుతున్న బాధితులకు భోజనం సరఫరా చేసే బాధ్యతలను పర్యాటకశాఖ చూస్తుండటం కొంత ఊరట. ఖాళీగా ఉంటున్న ఉద్యోగులతో రోజుకు 1,300 మందికి భోజనాలు అందిస్తున్నారు. దీనిద్వారా గతనెల రూ.15లక్షల ఆదాయం రాగా ఈనెల రూ.30లక్షల ఆదాయం రానుంది.
×రూ.22.76 కోట్ల నష్టం
కోవిడ్‌ ప్రభావం ప్రారంభమైన ఏప్రిల్‌ నుంచి యూనిట్లు పునఃప్రారంభమైన జూన్‌8 తర్వాత నుంచి ఆగష్టు వరకు పర్యాటకశాఖకు రూ.22,76,22,404 నష్టం వాటిల్లింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగష్టు వరకు పర్యాటక ఆదాయం రూ.23,26,41,586. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగష్టు వరకు వచ్చిన ఆదాయం కేవలం రూ.50,19,182. అంటే నష్టం ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. 2011-12లో రూ.18.47 కోట్లు, 2012-13లో రూ.22.82, 2013-14లో రూ.22.28, 2014-15లో రూ.20.02,
2015-16లో రూ.33.16, 2016-17లో రూ.30.31, 2017-18లో రూ.8.53, 2018-19లో రూ.43.12
2019-20లో ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంతకుమించి ఆదాయం రావాలి కాని పరిస్థితులు అనుకూలంగా లేవు. కాగా 2009 నుంచి 2019 వరకు టూరిజం ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 52కోట్లు దాటింది. ఈ ఏడాది వేలల్లోనే ఉండనుంది.

×జిల్లాలో ఏప్రిల్‌ నుంచి ఆగష్టు వరకు ఆదాయం
—————————————-
యూనిట్‌ 2020 2019
—————————————-
తిరుమల రూ.2,800 రూ.12,65,888
హార్సిలీహిల్స్ రూ.35,66,665 రూ.2,20,68,687
శ్రీకాళహస్తీ రూ.5,90,409 రూ.55,13,972
పులిగుండు రూ.1,27,395 రూ.16,15,013
కైలాసనాధకోన రూ.71,593 రూ.4,92,037
పలమనేరు హ్గటల్‌ రూ.24,900 రూ.24,40,966
రవాణా —- రూ.19,91,34,293
—————————————

×హార్సిలీహిల్స్ మాదిరి ప్రణాళిక అమలు
జిల్లాలో కోవిడ్‌ పరిస్థితులు అధిగమించి ఆదాయం సమకూర్చుకునే విషయంలో హార్సిలీహిల్స్లో అమలు చేస్తున్న ప్రణాళికను అవలంబించేందుకు చర్యలు చేపట్టాం. జిల్లాలో లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన యూనిట్లలో హార్సిలీహిల్స్కు రూ.35.66లక్షల ఆదాయం వచ్చింది. ఇది ప్రస్తుత అత్యధిక ఆదాయం. ఇక్కడ సందర్శకులకు అందిస్తున్న సౌకర్యాలు, భధ్రతాపరమైన చర్యలను అన్ని యూనిట్లలో అమలు చే స్తాం. ఆదాయమార్గాలను అన్వేషించి ఫలితాలు సాధించడం ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం. ఇప్పటికే భారీగా ఆదాయం కోల్పోయాం. నష్టాలను అధిగమించేలా పనిచేస్తున్నాం. దీనికి హార్సిలీహిల్స్ ఆదాయం నిదర్శనం. ఇక్కడి సిబ్బంది కృషి ప్రసంశనీయం.
–ఆర్‌వీ.సురేష్‌కుమార్‌రెడ్డి, తిరుపతి డీవీఎం

కోవిడ్‌ ఆస్పత్రులకు టూరిజం భోజనం

Tags: Dropped tourism!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *