కాసులు కురిపిస్తున్న ఆర్ ఎక్స్

Drops

Drops

Date:19/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కథలో కొత్తదనం, కథనం ఆసక్తికరంగా ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. అస్సలు అంచనాలు లేకుండా వచ్చి చాలా చిన్న సినిమాలు ఇలాగే బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. నిర్మాతలకు కాసుల వర్షాలు కురిపించాయి. ఇప్పుడు ‘ఆర్ఎక్స్100’ కూడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు.. ఇలా సినిమా అంతా కొత్తదనమే. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంతలా ఆదరిస్తున్నారు. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ‘విజేత’ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులు ‘ఆర్ఎక్స్100’ వైపు చూస్తున్నారు. తొలి వారం రోజుల్లో ‘ఆర్ఎక్స్100’ రూ.7 కోట్ల పైనే షేర్ వసూలు చేసింది. ఇది మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే వసూలు చేయడం విశేషం. జులై 12న విడుదలైన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే రూ.5,18,04,822 షేర్ వసూలు చేసింది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో కూడా హౌస్‌ఫుల్ షోలు నడిచాయి. దీంతో ఈ మూడు రోజుల్లో మరో రూ.2.5 కోట్ల మేర షేర్ వచ్చింది. మొత్తంగా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఎక్స్100’ కలెక్షన్ రూ. 7,55,23,363. సినిమాకు పెట్టిన బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది నాలుగింతల లాభం. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు అజయ్ భూపతికి ఇది తొలి సినిమానే అయినా ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. లవ్, యాక్షన్ కలబోతతో ఒక కొత్తరకం ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా హీరోహరోయిన్ల మధ్య రొమాన్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంది.
కాసులు కురిపిస్తున్న ఆర్ ఎక్స్  https://www.telugumuchatlu.com/drops/
Tags:Drops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *