వైకాపా హయంలో కరువయిన భద్రత

Date:29/10/2020

రాజమండ్రి  ముచ్చట్లు:

వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలో భద్రత కరవైందని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్ పాలనలో అత్యాచారాలపై నారీ భేరి నినాదంతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల రాజమహేంద్రవరంలో ఒకరిపై అత్యాచారం చేయడమే కాకుండా, పోలీసుస్టేషన్ ఎదురుగా వదిలివెళ్లడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నా రు. తెదేపా రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జి జవహర్ మాట్లాడుతూ, అత్యాచారాలఫై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన ఆరోపణలపై స్వయంగా ఫిర్యాదు చేస్తే.. న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం స్పందించి దిశ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు మృతి

Tags; Drought security during the Vaikapa regime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *