బీరు బాటిల్ లో మందు పాతర మావోయిస్టుల కొత్త ఎత్తుగడ
-సకాలంలో గుర్తించిన పోలీసులు
ములుగు ముచ్చట్లు :
అడవిలోకి కూంబింగ్ వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు కొత్తరహా మందుపాతరలు తయరుచేస్తున్నారు. తాజాగా వెంకటాపురం పామునూర్ అడవిలో బీర్ బాటిల్ లో ఐఐడి తో మందుపాతర దొరికింది. బీరు బాటిల్ లో మందపాతర నింపి వుంచడం పోలీసులు ఆశ్చర్యపరిచింది. ఏలాంటి అనుమానం రాకుండా పోలీసులే లక్ష్యంగా మందుపాతరను మావోలు అమర్చారు. చతిస్ఘడ్ డ్ అటవీ ప్రాంతం నుండి మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ గ్రామాలలో ప్రవేసించారని సమాచారంతో స్పెషల్ పార్టీ, సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసారు. ఈ నేపధ్యంలో బీరుబాటిల్ వ్యవహరాన్నిగుర్తించారు. సకాలంలో దాన్ని నిర్వీర్యం చేయడంతో ముప్పు తప్పింది. ఏలూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ కరెంట్ వైర్, బీర్ బాటిల్, బోల్ట్ లు, కాపర్ సీల్, గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నాం. మావోయిస్టు అగ్రనేతలు చంద్రన్న, దామోదర్, కనకాల రాజిరెడ్డి, మంగు, సుధాకర్ వెంకటాపురం పోలీస్ స్టేషన్ తో కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Tags; Drug in a beer bottle is a new move of Maoists
