Natyam ad

మద్యం మత్తులో బిఆర్ ఎస్  నేత వీరంగం

నల్గోండ ముచ్చట్లు:

నల్గోండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెం కు చెందిన బిఆర్ఎస్  నేత ముత్తినేని నాగేశ్వర్ రావు మద్యంమత్తులో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో వున్న నాగేశ్వరం రావు కారు వేగంగా నడు పుతూ పెళ్లి బృందం పైకి దూసుకెళ్లాడు. ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. వారిలో కొంతమంది మహిళలు వున్నారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి అలకాపురి కాలనీలో పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో మద్యం సీసాలు లభ్యం అయ్యాయి. పోలీసులు నాగేశ్వర్ రావును అదుపులోకి తీసుకున్నారు.

 

Tags: Drunk BRS leader Veerangam

Post Midle
Post Midle