మద్యం మత్తులో కారు డ్రైవింగ్-వ్యక్తికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి ముచ్చట్లు:
పల్నాడు జిల్లా నరసరావుపేట లోని సత్తెనపల్లి రోడ్డులో కారు విధ్వంసం సృష్టించింది. మద్యం మత్తులో కార్ నడుపుతూ రోడ్డుపై వచ్చిన వారిని గుద్దుకుంటూ వెళ్తున్న క్రమంలో కుచ్చళ్లపాటి అనిల్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ కుమార్ ను స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ కుమార్ కాలుకి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడు ఇస్సప్పాలెం అమ్మవారి గుడి ఎదుట తన కొబ్బరికాయలు దుకాణం నడుపుతున్నాడు. నరసరావుపేట ప్రకాష్ నగర్ లోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చి కారు తనని ఢీకొన్నదని తనకి తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించాడు.

Tags: Drunk driving-Man seriously injured
