సీఎంను కలిసిన డిఎస్సీ అభ్యర్దులు
అమరావతి ముచ్చట్లు:
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను 1998 డీఎస్సీ అభ్యర్ధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారన్నారు. 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసి, సీఎంని సన్మానించారు.
Tags: DSC candidates who met the CM

