డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి
సబిత ఇంద్ర రెడ్డి కలిసిన నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ముదిరాజ్
హైదరాబాద్ ముచ్చట్లు:

డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 26 వేల టీచర్ పోస్ట్లు భర్తీ చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న 16 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పిఈటి పోస్టులో తో పాటు అన్ని భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ముదిరాజ్ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబిత ఇంద్ర రెడ్డి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నోటిఫికేషన్ నిర్వహించాలని మంత్రి గారితో చర్చించారు నోటిఫికేషన్ లేక చాలా నెలలు అవుతున్న ప్రభుత్వ పాఠశాలల పై దృష్టి పెట్టకపోవడం సోషనీయాంశం ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటివరకు వాటిని అభివృద్ధి పథకంలో పెట్టకపోవడం కావాల్సిన టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడం విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక కలలాగే మిగిలిపోతుంది అని భయం పుట్టుకుందన్నారు. ఎలక్షన్ కాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ కు 6 నుంచి ఎనిమిది నెలలకు అడుగు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tags;DSC notification should be released immediately
