రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన డిఎస్పీ
గూడూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించారు. నెల్లూరు రూరల్ డిఎస్పి వీరాంజనేయరెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు చికిత్స పొందుతున్న ఐదు మందిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు డిఎస్పి వీరాంజనేయరెడ్డి మాట్లాడుతూ దామేగుంట గ్రామానికి చెందిన వారు ఇన్నోవా కారులో చెన్నైకి వెళుతుండగా బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో లారీని ఢీకొనడంతో సంఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందారని తెలిపారు గాయపడిన వారిని గూడూరు హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకువెళ్లారని వెల్లడించారు విచారణలో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు .
Tags; DSP visited road accident victims

