ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే దుబ్బాక ఘటనలు

Date:28/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించే విధంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధిపేటలో వ్యవహారంలో బిజెపి సంబంధీకుల నుండే రూ.18 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు విడుదల చేసిన విజువల్స్ ఉన్నాయని, దీనిని బట్టి బిజెపి నేతలు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మగ్దూంభవన్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  దుబ్బాక ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయని, కేంద్రం, రాష్ట్రంలో అధికార పార్టీలు పవర్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని విమర్శించారు.అధికారంలో ఉన్న వారు గౌరవాన్ని కాపాడుకునేలా ఉండాలే తప్ప దిగజార్చుకునే విధంగా వ్యవహరించవద్దని, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోకుండా సిద్ధిపేటలో హడావుడి చేశారని అన్నారు. ఎన్నికల్లో రాజకీయాలు చెప్పుకోవాలే తప్ప డబ్బుతో గెలవాలని చూడొద్దని సూచించారు.
లౌకిక శక్తులను గెలిపించాలి: దుబ్బాక నియోజకవర్గంలో సిపిఐకి పరిమితమైన బలం ఉన్నదని, అయితే అనేక యూనియన్ ఉన్నాయని చాడ వెంకట్ తెలిపారు. అందరితో చర్చించిన తరువాత ఎన్నికల్లో తటస్థంగా ఉంటూనే మతోన్మాద  బిజెపిని ఓడించాలని, లౌకిక శక్తులను గెలిపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

 

కేంద్రం తక్షణమే రూ.2వేల కోట్లు ఇవ్వాలి : అకాల వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు రూ.10వేల కోట్ల నష్టం జరిగిందని, కాని కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క పైసా విడుదల కాలేదని చాడ వెంకట్ అన్నారు.బిజెపి నేతలు ప్రగల్భాలే తప్ప నిధుల విడుదల చేయించడంలో విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే మొదటి విడతగా రూ.2వేల కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేలు ఇవ్వడం మంచిదేనని, అయితే ఇళ్ళు కూలిపోయిన వారికి లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేలే ఇవ్వడం సరిపోదని చాడ వెంకట్ వ్యాఖ్యానించారు. వారికి కొత్త ఇళ్ళు కట్టి ఇవ్వాలన్నారు. అలాగే గ్రామాల్లో పంట పొలాలకు కూడా అపారమైన నష్టం కలిగిందని, వరికి ఎకరానికి రూ.20వేలు, పత్తికి రూ.30వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అప్పు త్చ్చునా రైతులను ఆదుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

Tags: Dubaka events that corrupt democracy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *