దుబ్బాక ఫలితమే.. హూజూరాబాద్ లో

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలో దుబ్బాకలో జరిగిన సీన్ రిపీట్ అవుతుందని బీజేపీఎమ్మెల్యే రఘునందన్ రావు తేల్చి చెప్పారు. గురువారం ఆయన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మండలాల బీజేపీ ఇన్చార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో పోలీసులు ఒకటి కొడితే మనం రెండు కొట్టామని అన్నారు. మాస్కులు లేకున్నా టవల్స్ చుట్టుకొని సీసీటీవీ కెమెరాల కంట పడకుండా పోలీసులను ఎదుర్కొన్నామని చెప్పారు.భవిష్యత్తులో జరిగే హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని అన్నారు. దుబ్బాక కంటే రెండు పనులు ఎక్కువే చెయ్యాల్సిన పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. బీజేపీలో కార్యకర్తగా, నాయకుడిగా అంచెలంచెలుగా ఎదగడానికి ఉన్న అవకాశాలు ఇతర ఏ రాజకీయ పార్టీలో లేవని రఘునందన్ రావు వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Dubaka is the result .. in Huzurabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *