సెస్సు ద్వారా బాదుడు

Date:18/09/2020

విజ‌య‌వాడ‌ ముచ్చట్లు:

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధిస్తారా.. జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోనుందా.. రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 1 మేరకు సెస్ విధించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సెస్‌పై ప్రభుత్వం కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 3న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ద్వారా రూ. 600 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్న సర్కార్.. సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించాలని భావిస్తోందట. ఈ అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.సెస్ సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వం ఇటీవలే సహజ వాయువులపై వ్యాట్ పెంచింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయింది. అందుకే సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.ఏప్రిల్ 2020 నెలకు రూ.4480 కోట్లు ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం రూ.1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 

 వెంకటగిరి  చీరలకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌

Tags:Duck by Sess

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *