Natyam ad

పెద్దిరెడ్డి కుటుంభానికి దూదేకుల ముస్లింల మద్దతు

– రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సయ్యద్‌బాజి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు నూర్భాషా దూదేకుల ముస్లింలు మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌సయ్యద్‌బాజి తెలిపారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు అన్వర్‌, తంబళ్లపల్లె ప్రతినిధి చాంద్‌బాషా, రాష్ట్ర నాయకుడు యాసిన్‌, యూత్‌ అధ్యక్షుడు మట్టిపాటి బాషాలతో కలసి సదుం మండల కేంద్రంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సయ్యద్‌బాజి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలతో పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అఖండ విజయంతో గెలిపిస్తామన్నారు. దూదేకుల కులస్తులకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సహాయం మరువలేమన్నారు. ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి అభ్యర్థులను గెలిపించేలా ప్రచారాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులు అక్భర్‌, అష్రఫ్‌, మహమ్మద్‌, ఫకృబిన్‌, రహిమ్‌, నసీరుద్ధిన్‌, మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Dudekula Muslims support the Peddireddy family

Post Midle