Natyam ad

8న చంద్ర‌గ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత

– బ్రేక్ ద‌ర్శనాలు రద్దు

– నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

Post Midle

చంద్ర‌గ్రహణం కారణంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 నుండి రాత్రి  దాదాపు 7.30 గంట‌ల‌ వరకు 11 గంటల పాటు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది.చంద్ర‌గ్రహణం కారణంగా శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను టిటిడి రద్దు చేసింది. రాత్రి 7.30 గంట‌లకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.  భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

 

Tags: Due to Lunar Eclipse on 8th the doors of Srivari Temple will be closed for 11 hours

Post Midle

Leave A Reply

Your email address will not be published.