దవాఖానాలకు క్యూ కడుతున్నారు

Date:13/03/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ బాగా ప్రాచుర్యం పొందింది.. ఈ కిట్‌లో అం దిస్తున్న 16 వస్తువులు తల్లీబిడ్డకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సర్కారు దవాఖానల్లో పురుడు పోసుకొని ఆడపిల్ల జన్మిస్తే రూ. 13 వేలు, మగ పిల్లాడు జన్మిస్తే రూ.12 వేలు అందిస్తున్నారు. దీనికి తోడు తల్లీ, పుట్టబోయే బిడ్డకు అమ్మఒడి అండగా నిలుస్తుండటంతో గర్భిణులు ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖాన వరకు కిటకిటలాడుతున్నాయి. గతంతో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య మూడింతలు పెరిగింది. జిల్లా కేం ద్రంలోని పెద్ద దవాఖానలో రికార్డు స్థాయిల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. గతేడాది జూన్ నుంచి ఫిబ్రవరి నెల వరకు (9 నెలల్లో) జిల్లా దవాఖానలో 6402 ప్రసవాలు జరిగాయి. జిల్లాలోని ప్రభుత్వ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో 9 నెలల్లో మొత్తం 13737 ప్రసవాలు జరిగాయి. జిల్లాలోని సర్కారు దవాఖానల్లో ఈ 9 నెలల్లో మొత్తం 20139 డెలివరీలు జరిగాయి. అదే ప్రైవేటు దవాఖానల్లో అయితే కేవలం 6339 ప్రసవాలు మాత్రమే అయ్యాయిప్రభుత్వ దవాఖానలకు జనం క్యూ కడుతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో తరలివస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కిట్, అమ్మఒడితో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద దవాఖానకు ప్రసవాల కోసం గర్భిణులు తరలివస్తున్నారు. ఇక్కడ వైద్యాధికారులు ప్రసవాల కోసం వచ్చే గర్భిణులకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలు అం దిస్తున్నారు. లేబర్ రూం, మెటర్నటీ వార్డుల స్థాయికి మరమ్మతులు వేగంగా చేపడుతున్నారు. ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుం డా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమ్మఓడి, కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టిన త ర్వాత ప్రభుత్వ దవాఖానలలో ప్రసవాలు బాగా పెరిగాయి. కేసీఆర్ కిట్ రావడంతో పాటు ప్రభుత్వ దవాఖాన లలో అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వసతులు, ఆధునిక పరికరాలు, లెబర్ రూం అందుబాటులో ఉన్నాయి. నిరంతరం వైద్యులు, సిబ్బంది, మందులు, రవాణా సేవలను, భోజన వసతి కల్పించడంతో పాటు వైద్యసేవలు అందిస్తున్నామంటున్నారు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ రజిని. మాకు పాప పుట్టింది. నగదును బ్యాంకులో వేస్తారట. కేసీఆర్ కిట్ కూడా ఇస్తారట. అందు లో సబ్బులు, పౌడర్, పాపకు, నాకు బట్టలు, సూట్‌కేస్, నూనెతోపాటు పలు వ స్తువులు బాగున్నాయంటున్నారుబొమ్మారెడ్డి కల్పన.
Tags: Due to the diapers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *