Natyam ad

ప్రభుత్వ అసమర్థత తోనే రైతు దీక్షలో మృతి

చిత్తూరు ముచ్చట్లు:

భూమి కోసం ఓ రైతు ప్రాణాలొదిలిన ఘటన శనివారం చిత్తూరు జిల్లా పెనుమూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజాఇండ్లు గ్రామానికి చెందిన రత్నం బోయుడు (62) అనే రైతుకు సర్వే నెంబర్‌ 918/4లోని భూమికి 1974లో లీజు పట్టా ఇచ్చారు. రైతుకు భూమి చెందకూడదనే ఉద్దేశంతో తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రత్నం బోయుడు 2009లో చిత్తూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ భూమి అతనిదేనని న్యాయస్థానం పర్మినెంట్‌ ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది.ఆ తర్వాత తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇటీవల రత్నం బోయుడు చెందిన భూమిలో కొందరు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ విషయంలోనూ రత్నం బోయుడు కోర్టుకు వెళ్లారు. నాలుగు రోజుల క్రితం మిగిలిన భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు. వీఆర్వో వెళ్లి పనులు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అదేరోజు రత్నం బోయుడు తహశీల్దార్‌ రమణిని కలిసి సమస్య వివరించారు.

Post Midle

Tags:Due to the inefficiency of the government, the farmer died in Diksha

Post Midle

Leave A Reply

Your email address will not be published.