పంజాబ్ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

Due to the negligence of the driver of the Punjab incident

Due to the negligence of the driver of the Punjab incident

 Date:20/10/2018
లూధియానా ముచ్చట్లు:
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదానికి రైల్వే నిర్లక్ష్యంగా కూడా కారణమని స్పష్టమవుతోంది. ట్రాక్‌ను తనిఖీ చేసి సమాచారం అందించే లైన్‌మ్యాన్ తప్పిదం వల్ల 59 మంది బలయ్యారు. ఈ ప్రమాదానికి కారణమైన డీఎంయూ రైలును నడిపిన డ్రైవర్.. పంజాబ్ పోలీసులకు తెలిపిన వివరాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ‘రైలు ముందుకు పోనిచ్చేందుకు గ్నీన్ సిగ్నల్ కనిపించింది. ఆ సమయానికి రైల్వే ట్రాక్ మీద వందలాది మంది ఉన్నారనే సంగతి నాకు తెలీదు. అందుకే రైలు ఎప్పటిలాగానే నిర్ణిత వేగంలో నడిపా’’ అని రైలు డ్రైవర్ తెలిపాడు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న లైన్‌మ్యాన్‌ను సైతం పోలీసులు ప్రశ్నించారు.
ట్రాక్ మీద జనాలు ఉన్నట్లు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వకుండా, గ్రిన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించాడు. ఈ ప్రమాదం జరిగే సమయానికి రైల్వే మంత్రి పియూష్ గోయల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే ఆయన ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. రైల్వే సహాయ మంత్రి మనోజన్ సిన్హా శుక్రవారం రాత్రే ప్రమాద స్థలికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. అక్కడ రావణ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తమకు సమాచారం ఇవ్వలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత వేడుక నిర్వాహకులు పరారయ్యారు.
Tags:Due to the negligence of the driver of the Punjab incident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *