Natyam ad

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు నీట మునిగాయి

కర్నూలు ముచ్చట్లు:


ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు.నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్బిసి కాలువ 7వ బ్లాకు తెగి దాదాపు 50 ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  దెబ్బతిన్న ఎస్ఆర్బిసి కాలువలను మరమ్మతులు చేయకపోవడం వలన పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పంట కాలువలను పటిష్టం చేయాలని  అలాగే రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

 

Tags: Due to the negligence of the government, the crops were drowned

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.