పుంగనూరులో పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షనర్ల బకాయిలను చెల్లించాలని పెన్షనర్ల సంఘ అసోషియేట్ అధ్యక్షుడు గురురాజరావు డిమాండ్ చేశారు. సోమవారం సంఘ కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2018 జూలై నుంచి 2022 వరకు చెల్లించాల్సిన డిఆర్ బకాయిలను చెల్లించాలన్నారు. అలాగే పెన్షన్ సకాలంలో పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు చంద్రశేఖర్, గంగులమ్మ, కేశవరెడ్డి, సిద్దలింగం, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, సుబ్రమణ్యం, రాఘవులజెట్టి, సుకుమార్‌బాబు, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: Dues of pensioners should be paid in Punganur
