స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం

Durga Devi is the dream of devotees

Durga Devi is the dream of devotees

Date:10/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దసరా మహోత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో అమ్మవారి తొలి అలంకారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు దర్శనమిస్తుందా తల్లి. బంగారు వర్ణం గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సమస్త దారిద్య్రబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. బుధవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి రుత్వికులు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్నపనాభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. బాల భోగ నివేదనలు, నిత్యార్చనలు పూర్తయిన తరువాత ఉదయం 8 గంటలకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు 18వ తేదీతో ముగియనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంతో దర్శనమిస్తారు. తొలిరోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.. రేపటి నుంచి ఒక్కో అలంకారంతో భక్తులకు కనువిందు చేస్తారు. 11న బాలత్రిపుర సుందరీదేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న లలితాత్రిపుర సుందరీదేవిగా, 14న సరస్వతీదేవిగా, 15న అన్నపూర్ణా దేవిగా, 16న మహాలక్ష్మీదేవిగా, 17న దుర్గాదేవిగా, 18న మహిషాసుర మర్ధినిగా, రాజరాజేశ్వరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 14న సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
Tags:Durga Devi is the dream of devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed