Natyam ad

నేటి నుంచి బోయకొండపై దసరా మహోత్సవాలు

చౌడేపల్లె ముచ్చట్లు:

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం లో నవరాత్రులు లో భాగము గ మొదటి రోజు బాలత్రిపురాసుందరి దేవి గ అమ్మవారి అలంకారం.శక్తిక్షేత్రం బోయకొండపై అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఓ చంద్రమౌళి తెలిపారు. ఈనెల 15న బాలత్రిపుర సుందరీదేవీ, 16న పార్వతీదేవీ, 17న మహాలక్ష్మీ, 18న ధనలక్ష్మీదేవీ, 19న శాఖాంబరీదేవీ, 20న సరస్వతీదేవీ, 21న దుర్గాదేవీ, 22న మహిషాసురమర్ధినిదేవీ, 23న రాజరాజేశ్వరీ అలంకరణలతో అమ్మవారు దర్శనమిస్తారన్నారు. దసరా మహోత్సవాలకు బోయకొండ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దామనీ, విశేష సంఖ్యలో తరలివచ్చే యాత్రీకులకు సకల వసతులు సమకూర్చామన్నారు.

Post Midle

Tags: Dussehra celebrations on Boyakonda from today

Post Midle