దుమ్మురేపుతున్న సైరా టీజర్

Dusty Sierra Teaser

Dusty Sierra Teaser

Date:20/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

మెగా అభిమానులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. రోమాలు నిక్కబొడిచేలా సైరా టీజర్ కట్ చేసింది సినిమా యూనిట్,ఇప్పటికే విడుదలైన మూవీ మేకింగ్ వీడియోకి అద్భుతమైన స్పందన రాగా లేటెస్ట్ గా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.

 

 

 

 

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌లో చిరంజీవి కుమారుడు రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.లేటెస్ట్ గా విడుదలైన టీజర్ లో ఇంట్రో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం విశేషం. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఫస్ట్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, తమన్నా వంటి టాప్ స్టార్లు నటిస్తున్నారు. 2019 అక్టోబ‌ర్ 2వ తేదీన గాంధీ జ‌యంతి సందర్భంగా సినిమా విడుదల అవనుంది

టిటిడి కల్యాణ మండపాల పునరుద్ధరణ పనులు  పరిశీలన

Tags: Dusty Sierra Teaser

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *