Natyam ad

వన్యప్రాణులను కాపాడటం కర్తవ్యం- పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి

– ఆక్రమణలను అరికడ తాం

-ఏనుగులతో నష్టపోయిన వారికి పరిహారం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

అటవిప్రాంతాలలో గల వన్యప్రాణులను కాపాడటం మన అందరి కర్తవ్యమని , అటవి ప్రాంతాల్లో ఆక్రమణలను అరికట్టి , మానవాళి మనుగడకు అవసరమైన అటవిప్రాంతాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌కన్సవేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్ వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో సీసీఎఫ్‌  ఎన్‌.నాగేశ్వరరావు, డిఎఫ్‌వో సి. చైతన్యకుమార్‌రెడ్డి , డిఎఫ్‌వో ఎఫ్‌ఎస్‌పి డిఏ కిరణ్‌తో కలసి ఆవరణంలో వెహోక్కలు నాటారు.విలేకరుల సమావేశంలో మధుసూన్‌రెడ్డి మాట్లాడుతూ సోమల మండలంలో దురాక్రమణకు గురైన అటవి భూములను పరిరక్షిస్తామన్నారు.  అలాగే ఏనుగులతో నష్టపోయిన వారికి అధిక నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఏనుగులకు ఆహారము, నీటి కొరత కారణంగా అడవులు వదిలి బయటకు రావడం జరుగుతోందన్నారు. అటవి ప్రాంతాలలో గతంలో భూములు పట్టాలు పొంది, సాగు చేయడంతో అటవి ప్రాంతం  హద్దులు తప్పిందన్నారు. దీని కారణంగా ఏనుగులు ఆరటి, చెరకు పంటలపై పడటం జరుగుతోందన్నారు. ఏనుగులను అటవిప్రాంతంలో నియంత్రిస్తూ వాటికి తగిన ఆహారము, నీరు లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా టూరిజం ప్రాంతాలను స్థానికంగా ఏర్పాటు చేయాలని సూచించారు.  సమావేశంలో డీఎఫ్‌వో ఎస్‌ఎఫ్‌ సోమశేఖరన్‌, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Duty to protect wildlife – PCCF Madhusudan Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.