అమరావతి ముచ్చట్లు:
కలకలం రేపుతున్న ఆడియో ఇదిగో!శ్రీకాకుళం జిల్లా తలగాం వద్ద మాధురి పెట్రోలు బంక్ దానిని పునరుద్ధరించాలంటూ అధికారికి దువ్వాడ ఫోన్ దాని అనుమతులు రద్దయ్యాయని, పునరుద్ధరణ సాధ్యం కాదన్న అధికారిఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ..తాను రోడ్‌సైడ్ వ్యక్తిని కాదంటూ హెచ్చరిక వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ పెట్రోలు రిఫైనరీ సంస్థ అధికారి ని ఫోన్‌లో బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రస్తుత వివాదంలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడలిలోని పెట్రోలు బంకు అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత రిఫైనరీ అధికారిని తీవ్ర స్వరంతో బెదిరించారు.అయితే, ఆ బంకుకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్‌షిప్ కూడా తొలగించామని, కాబట్టి పునరుద్ధరణ సాధ్యంకాదని అధికారి బదులిచ్చారు. అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తే మాట్లాడాలని, మీరెలా మాట్లాడతారని అధికారి ప్రశ్నించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. తానెందుకు మాట్లాడకూడదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. తాను ఎమ్మెల్సీనని, రోడ్‌సైడ్ వ్యక్తిని కాదంటూ ఊగిపోయారు. తాను డీఎంతో మాట్లాడానని, అయినప్పటికీ ఎందుకు చేయవని అధికారిని దువ్వాడ ప్రశ్నించారు. దువ్వాడ గొంతు పెంచడంతో అరవొద్దని అధికారి సూచించారు.
Tags:Duvwada threatens the officer for restoration of Madhuri petrol station