Dwarkanathareddy provided by PPE kits

పిపిఈ కిట్లు అందించిన ద్వారకనాథరెడ్డి

#సొంత నిధులతో అందజేత
#అధికార యంత్రాంగం కృషి మరువలేనిది
#కురబలకోటలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

Date:08/05/2020

కురబలకోట ముచ్చట్లు:

తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన అంగళ్లు విశ్వం కళాశాల క్వారంటైన్ సెంటర్ లో ఈ రోజు శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తన సొంత నిధులతో క్వారంటైన్ సెంటర్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్ కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక్క కరోనా కేసు లేదని, ఈ ఖ్యాతి నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు దక్కుతుందని అభినందించారు. నియోజకవర్గంలోని తంబళ్లపల్లె, బీ.కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన, 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన సిబ్బందికి కూడా ఈ కిట్లను అందచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
బి.కొత్తకోట మాజీ ఎంపీపీ పాగోండ ఖలీల్, మాజీ కో ఆప్షన్ సభ్యులు బావాజాన్, అధికారులు పాల్గొన్నారు.

గుజరాత్‌ గిర్‌ అడవుల్లో కలకలం.. 23 మృగరాజులు మృతి 

Tags: Dwarkanathareddy provided by PPE kits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *