Natyam ad

పుంగనూరులో ముందస్తు క్రిస్‌మస్‌ వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని హట్టన్‌మెమోరియల్‌ చర్చిలో మంగళవారం ముందస్తు క్రిస్‌మస్‌ వేడుకలను నిర్వహించారు. క్రైస్తవ సంఘ కార్యదర్శి రవికుమార్‌, సురేష్‌ కిష్టఫర్‌ ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు అన్నదానం నిర్వహించారు. అలాగే కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు. క్రైస్తవ బోదనలను చదివి వినిపించారు. ప్రతి ఒక్కరు ఏసుక్రిస్తు చూపిన ప్రేమ సందేశాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమారి, సుధాకర్‌, సత్యరాజ్‌, దైవప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Early Christmas celebrations in Punganur

Post Midle