ముందస్తు ఎన్నికలు.. మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..
అమరావతి ముచ్చట్లు:
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని చెప్పారు.అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు.

Tags: Early elections.. Minister Peddireddy Clarity.
