ఆర్జన మందగమనం

Date:15/02/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లాలో ఇటీవలిగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం మందగించింది. వ్యవసాయ దిగుబడులు తగ్గడమే దీనికి కారణంగా చెప్తున్నారు. ఆదాయం పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు కమిటీలు అందుకోలేకపోతున్నాయి. గతేడాది టార్గెట్ సాధించలేకపోయిన మార్కెటింగ్‌ శాఖకు ఈ దఫా సైతం అదే రిజల్ట్ వస్తుందన్న ఆందోళన పట్టుకుంది. ఫీజులే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ప్రధాన ఆదాయవనరు. మార్కెట్‌ యార్డుల్లో జరిగే సరకుల కొనుగోళ్ల విలువలో ఒక శాతం మొత్తాన్ని కొనుగోలుదారు నుంచి మార్కెట్‌ ఫీజుగా వసూలు చేస్తారు. మార్కెట్లు, వాటి పరిధిలోని చెక్‌పోస్టుల నుంచి ఈ ఫీజును వసూలు చేస్తారు. ఖమ్మం జిల్లాలో 23 మార్కెట్‌ చెక్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏన్కూరు, గంగారం, మధిర, ముత్తగూడెం చెక్‌పోస్టుల నుంచి ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 చెక్‌పోస్టులు ఉన్నాయి. పత్తి,  మిరప, అపరాలు, ధాన్యం, సుబాబుల్‌, మొక్కజొన్న పంటల ద్వారా ఇక్కడ ఆదాయం సమకూరుతోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని మార్కెట్‌ యార్డుల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి, రైతు సంక్షేమ పథకాలకు వినియోగిస్తుంటారు.2017-18కు ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ల ఆదాయం రూ.29.49 కోట్లుగా నమోదు అయింది. గత జనవరి వరకు రూ.18.45 కోట్ల ఆదాయం లభించింది. మార్చి 31 వరకు లక్ష్యం గడువు ఉంది. అయినప్పటికీ లక్ష్యం చేరడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. మార్కెట్లకు వస్తున్న పంట పరిమాణాన్ని బట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతేడాది జిల్లా లక్ష్యం రూ.20.82 కోట్లు కాగా రూ.15.63 కోట్లు మాత్రమే దక్కాయి. దీంతో మార్కెట్ కమిటీలు లక్ష్యం చేరుకోలేకపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మార్కెటింగ్‌ శాఖ లక్ష్యం చేరే పరిస్థితి కన్పించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రెండు జిల్లాల్లోని ఆదాయంపై పంటల దిగుబడి తగ్గడంతో దాని ప్ర వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు మార్కెట్ కమిటీ శ్రేణులు చెప్తున్నాయి. ఇదిలాఉంటే జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అందుకే ఈసారి కొంత ఆదాయం పెరిగిందని అంటున్నారు. ఇక చెక్‌పోస్టుల దగ్గర సెస్సు చెల్లింపుపైనా అధికారులు దృష్టిసారించారు. సెస్సు చెల్లించకుండా వెళితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. మొత్తంగా వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెంచేందుకు అధికారులు భారీగానే కసరత్తు చేస్తున్నారు.
Tags: Earnings slow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *