గ్రానైట్ హబ్ లో ఎవరికి ఎర్త్.. ఎవరికి బెర్త్

Date:10/11/2018
కరీంనగర్ ముచ్చట్లు:
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాలు, నియోజకవర్గాలపై ఎట్ న్యూస్ రిపబ్లిక్  స్పెషల్ రిపోర్ట్ అందిస్తోంది. రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ రణక్షేత్రాన్ని మీముందుంచుతోంది.నియోజకవర్గాల గురించి తెలుసుకునే ముందు జిల్లా ప్రత్యేకతలేంటో చూద్దాం. సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా కరీంనగర్ కు ఆపేరు వచ్చింది.
గతంలో ఈప్రాంతాన్ని ‘సబ్బినాడు’ అని పిలిచేవారు. నిజాంపరిపాలనలో కరీంనగర్ ఒక రాజధానిగా ఉండేది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ కవులు డాక్టర్. సి. నారాయణ్ రెడ్డి, గంగుల కమలాకర్ లాంటి సుప్రసిద్ద వ్యక్తులను అందించిన జిల్లా. గోదావరి నది అందాలు ప్రత్యేక ఆకర్షణ. పలు గిరిజన జాతులకు కరీంనగర్ ఆవాసంగా ఉంటోంది. ఇక్కడ వెండి నిగీషీ నిపుణులు ఎక్కువగా ఉంటారు. ఇక కొండగట్టు అంజన్న ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పలు బౌద్దక్షేత్రాలుకూడా ఉన్నాయి. గ్రానైట్ పరిశ్రమలో కరీంనగర్ జిల్లా అంతర్జాతీయ గుర్తింపును పొందింది.
జిల్లాలో దాదాపు 300 వరకు  గ్రానైట్ యూనిట్లు, దాదాపు 400 వరకు గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, బీహార్  రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి చైనాకు గ్రానైట్ రాయిని ఎగుమతి చేస్తుండటంతో ఈ ప్రాంతానికి గ్రనైట్ హబ్గా పేరు దక్కింది. జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, దాదాపు 400 వరకు ప్రైవేట్ నర్సింగ్హోంలు, హాస్పిటల్స్ ఉండటంతో పాత కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం ఇక్కడకు వస్తుంటారు.
Tags; Earth in the Granite Hub .. Who’s the berth?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *