Natyam ad

వర్షాలకు కూలిన మట్టి మిద్దెలు

అల్లూరులో మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మృతి

నందికొట్కూరు ముచ్చట్లు:

Post Midle

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల మండలం సంకిరేణి పల్లె ,నందికొట్కూరు మండలం లోని అల్లూరు గ్రామంలో రెండు మట్టి మిద్దెలు కులాయి. గురువారం ఉదయం కురిసిన వర్షానికి మట్టి మిద్దె కూలి అల్లూరు గ్రామానికి చెందిన సావిత్రమ్మ (74) వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలు ఉదయం వంటగదిలో వంట చేస్తుండగా మిద్దె పై కప్పు కూలిపోయింది. సంఘటన విషయం తెలుసుకున్న బంధువులు మట్టిలో కూరుకుపోయిన  వృద్ధురాలిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు .అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు. ఘటన సమాచారం అందుకున్న నందికొట్కూరు తహశీల్దార్ రాజశేఖర్ బాబు  గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సంకిరేణి పల్లె గ్రామానికి చెందిన కమ్మగిరయ్య  ఇంటి పైకప్పులు కూలిపోయినట్లు బాధితులు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బంధువులు కోరారు.

 

Tags: Earthen locusts that fell due to rains

Post Midle