Natyam ad

నేపాల్ ను వణికించిన భూకంపం

ఖట్మాండూ ముచ్చట్లు:

 


నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం సంభవించింది.  నేపాల్ జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ  భూకంపం వల్ల 37 మంది మృతి చెందినట్లు సమాచారం. జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన బలమైన భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.  జాజర్కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కొలత కేంద్రం అధికారులు తెలిపారు.   భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత నేపాల్ హోం మంత్రిత్వ శాఖ 24 మృతదేహాలను వెలికితీసింది.  భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు అయింది. ఈ తీవ్రత ప్రభావానికి భారత్‌లోని పలు ప్రాంతాల్లో,
ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.

 

Tags: Earthquake shook Nepal

Post Midle
Post Midle