Natyam ad

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

చిత్తూరు ముచ్చట్లు:


చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి  భూప్రకంపనలు నమోదయ్యాయి.  పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ఇళ్ల నుంచి బయటకు వచ్చి జనం  పరుగులు తీసారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో  ప్రకంపనలు  కనిపించాయి. 15 నిమిషాల వ్యవధిలో  మూడుసార్లు  భూమి కంపించింది. , గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు.

 

Tags; Earthquakes in Chittoor district

 

 

Post Midle
Post Midle