తూర్పు కాపులను ఓబీసీలుగా గుర్తించాలి
పాలకొల్లు ముచ్చట్లు:
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులను ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించాలని తూర్పు కాపు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా నలుమూలాల నుండి తూర్పు కాపు నాయకులు భారీ తరలివచ్చి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించరు. బిజెపి నాయకుడు కురెళ్ల రఘురాంకు, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ముందుగా పాలకొల్లులో డాక్టర్ గమిడి సూర్యారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో కర్నేని గౌరీ నాయుడు, చందక సత్తిబాబు, పాలవలస తులసిరావు, యరకల రంగా పొట్నూరి శ్రీను, దనాల ప్రకాష్, బాకూరి నిరంజన్, సిడగం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags: Eastern Kapus should be recognized as OBCs
