దేవినేని అవినాష్ కు తూర్పు బాద్యతలు

Easterners to Avinash Devineni

Easterners to Avinash Devineni

Date:21/11/2019

విజయవాడ ముచ్చట్లు:

టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరిన దేవినేని అవినాష్‌కు అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పదవి ఖాయం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని అవినాష్ స్వయంగా తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన జగన్‌కు దేవినేని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.టీడీపీలో తనకు అన్యాయం జరిగిందన్నారు దేవినేని అవినాష్. భుజంపై చేయి వేసినంత మాత్రాన న్యాయం జరిగినట్లు కాదన్నారు. వైఎస్ జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సీఎంపై నమ్మకంతో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు అవినాష్. తూర్పు నియోజకవర్గ ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతానని.. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. తాను పార్టీలో చేరడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు.తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి.. స్థానికుల్ని, అభిమానులను, కార్యకర్తల్ని కలిశారు. ఎలాంటి పరిణామాలైనా తనను ఇంతలా అభిమానిస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లుగా తనను నడిపించింది అభిమానులు, కార్యకర్తల ఆశీర్వాద బలమే అన్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా అందరితో పంచుకున్నారు దేవినేని అవినాష్.

 

 

గుట్టపాళ్యంలో పడకేసిన పారిశుధ్యం

 

Tags:Easterners to Avinash Devineni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *