ప్రభుత్వ పథకాలతో ఆర్థిక వృద్ధి సాదించాలి

Economic growth should be achieved with government schemes

Economic growth should be achieved with government schemes

Date:12/01/2019
కర్నూలు ముచ్చట్లు:
ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ విభిన్న ప్రతిభావంతులను ఉద్దేశించి అన్నారు.  శనివారం ఉల్చాల గోదాములో విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు 132 బ్యాటరీ ట్రై సైకిల్స్, 10 హోండా స్కూటర్స్ ను ఎం.పి.బుట్టా రేణుకతో కలసి ఆయన పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ ఏడిఐపీ పథకం కింద టై సైకిల్స్ ను అందిస్తున్నామని ఒక్కొక్క బ్యాటరీ సైకిల్ ధర రూ.42 వేలు అని తెలిపారు. ఇందులో  రూ.30,000లు భారత ప్రభుత్వం వాటా కాగా, కర్నూలు ఎం.పి బుట్టా రేణుక ఎం.పి లాడ్స్ నిధుల నుండి రూ.12,000లు వాటాగా అందించిందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 హోండా స్కూటర్లను ఇచ్చిందని, ఒక్కదాని విలువ రూ.85 వేలు  అని అన్నారు.  వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  ఇటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి వికలాంగులకు వీటిని అందించిన ఎం.పి బుట్టా రేణుకను కలెక్టర్ అభినందించారు.
విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం పెంచిన పింఛన్ ను ఫిబ్రవరి ఒకటో తేదీనుండి అందిస్తామన్నారు. ఎం.పి బుట్టా రేణుక మాట్లాడుతూ నా నియోజకవర్గ పరిధిలో వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ ను పంపిణీ చేయడం ఇది మూడవ సారీ అని అన్నారు. కర్నూలు ఏ.పి.ఎస్. పి బెటాలియన్ లో ఒక సారి, మంత్రాలయంలో ఒకసారి, ఇప్పుడు తిరిగి ఉల్చాల లో ఒకసారి మొత్తం మూడు సార్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా చాలా మంది అడుగుతున్నారని వారందరికి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  రూ.6 కోట్లతో ఒక సెంచూ రియన్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు.  వికలాంగుల సౌకర్యార్థం  ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు భాస్కర్ రెడ్డి, గోదాము యజమాని రంగారావు, గోశాల సంరక్షక చైర్మన్ రామసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
Tags:Economic growth should be achieved with government schemes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *