Natyam ad

లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వేగం పెంచింది. హైద‌రాబాద్‌, ఢిల్లీ, పంజాబ్‌లోని ప్రదేశాల్లో శుక్రవారం ఉద‌యం నుంచి మ‌రోసారి దాడులు చేస్తోంది. రాబిన్ డిస్టిలర్స్‌లో డైరెక్టర్‌ అభిషేక్‌రావును ఆదివారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. విజయ్‌నాయర్‌, సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌ తర్వాత.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో అభిషేక్‌రావును అదుపులోకి తీసుకుంది సీబీఐ. దేశ రాజ‌ధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో అరెస్ట్‌లపర్వం కొనసాగుతోంది. ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈఓవిజ‌య్ నాయ‌ర్‌ను అరెస్ట్‌ చేసింది సీబీఐజ ఇటు ఇండోస్పిరిట్‌ ఎండీ సమీర్‌ మహేంద్రును ఈడీ అరెస్ట్‌ చేసిఇంది. తాజా అరెస్ట్‌లతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ, సీబీఐ స్పీడ్‌ పెంచింది. నిన్నవిజయ్ నాయర్ అరెస్ట్‌ కాగా.. ఇవాళ మహేంద్రు అరెస్ట్‌ అయ్యారు. విజయ్‌నాయర్‌ స్కామ్‌లో కీలక సూత్రధారి కాగా.. సమీర్ మహేంద్రు ఏ5 నిందితుడిగా ఉన్నారు. రాధా ఇండ్రస్ట్రీస్‌కు చెందిన యూకో బ్యాంక్ ఖాతాకు సమీర్ మహేంద్రు కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. ఈ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15మందిని నిందితులుగా తేల్చడంతో..ఇంకెంతమంది వెలుగులోకి వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని జోర్‌బాగ్ లో నివాసం ఉంటున్న సమీర్ మహేంద్రును సీబీఐ ఆగస్టులో విచారించింది. ఈ స్కామ్ ఆయనపై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించింది.

 

Post Midle

Tags: ED aggressive in liquor scam

Post Midle

Leave A Reply

Your email address will not be published.