జార్ఖండ్ ముఖ్యమంత్రి విడుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

హైదరాబాద్ ముచ్చట్లు:

 

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృ త్వంలోని జేఎంఎం- కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో నెగ్గింది.బలపరీక్ష అనంతరం రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ అధికార కూటమికి చెందిన 11 మం ది,సభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.వారిలో తాజా మాజీ సీఎం చంపయీ సోరెన్ కూడా ఉన్నారు. అయితే, హేమం త్ కు ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆయన విడుదలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది.భూకుంభకోణం కేసులో ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చంపయీ సోరెన్ ఫిబ్రవరి 2న సీఎం పదవి చేపట్టారు. ఈడీ అరెస్టు తరువాత హేమంత్ సోరెన్ జైలుకెళ్లారు.ఇటీవల హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన సోరెన్ సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే, హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ,సుప్రీంకోర్టును ఆశ్రయించింది.హైకోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ఈడీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనని, కేంద్ర ఏజెన్సీ తన పిటిషన్ ను త్వరగా విచారించాలని కోర్టును కోరింది.సుప్రీంకోర్టు ఈడీ పిటిషన్ పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠ భరితంగా మారింది.

 

 

Tags:ED approached the Supreme Court on the release of Jharkhand Chief Minister

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *