• Likes
  • Followers
  • Subscribers
  • Followers
Sign in

Welcome, Login to your account.

Forget password?
Sign in

Recover your password.

A password will be e-mailed to you.

  • Mar 21, 2023 6:54 pm
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • పుంగనూరు
    • తిరుమల
    • అనంతపురం 
    • కడప
    • కర్నూలు  
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పుగోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • పెద్దపల్లి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం 
    • శ్రీకాకుళం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్‌
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్‌  
    • కామారెడ్డి  
    • ఖమ్మం 
    • జగిత్యాల
    • నల్గోండ
    • నిర్మల్
    • మ‌హ‌బూబాబాద్
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • యాదాద్రి
    • రంగారెడ్డి
    • రాజన్న సిరిసిల్ల
    • వరంగల్ 
    • వికారాబాద్
    • శ్రీకాకుళం
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
  • జాతీయం
  • వరల్డ్
  • క్రైమ్
  • రాజకీయం
  • ఆరోగ్యo
  • భక్తి
  • సినిమా
    • ఫోటో గ్యాలరీ
    • హీరొయిన్స్

Telugu Muchatlu Telugu Muchatlu - Telugu Updates

TeluguMuchatlu
  • Home
  • Telangana
  • తలనొప్పిగా మారుతున్న ఈడీ కేసులు
Natyam ad
Telangana

తలనొప్పిగా మారుతున్న ఈడీ కేసులు

By TM-Team On Mar 14, 2023 12:18 pm 548
హైదరాబాద్, ముచ్చట్లు:
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు ఇసుమంతైనా తగ్గంచినట్లు కనబడటం లేదు. మార్చి 11న ఇదే కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కవిత విచారణకు హాజరవ్వడానికి ముందు వరకూ ఈడీ, మోడీ, మొదానీ అంటూ తీవ్ర స్థాయలో విరుచుకుపడిన బీఆర్ఎస్ శ్రేణులు ఆ తరువాత ఈ కేసుకు సంబంధంచి నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు.విచారణ తీరుపై కానీ, ఈ కేసు వెనుక కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేగాన్ని నియంత్రించే లక్ష్యం ఉందని కానీ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ కేసులో కవితను బయటకు తీసుకురావడానికి తెరవెనుక రాజీ ప్రయత్నాలు ఫలించేలా కనిపించాయనీ, అందుకే పార్టీ అధినేత కేసీఆర్ కవిత కేసు విషయంలో విమర్శలు వద్దనీ, టీవీ టాక్ షోలలో సైతం విమర్శలు చేయవద్దనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులే లోపాయికారీగా అంగీకరించారు. అయితే ఆ ప్రయత్నాలేమిటి? ఎవరిని కాంటాక్ట్ చేశారు? అన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈడీ కవితను ఈ నెల 16న మరో సారి విచారణకు రావాల్సిందని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ దానికి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. తప్పని సరి లాంఛనంగానే ఈడీ కవితను మరోసారి విచారణకు పిలిచిందని భావించారు. అయితే ఈడీ మాత్రం ఈ కేసులో  మనీ లాండరింగ్ ఉల్లంఘన, హవాలా లావాదేవీలు లాంటి ఆర్థిక అంశాల గుట్టుమట్ల నిగ్గు తేల్చే పనిలో ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి. దాదాపు ఎనిమిదిన్నర గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు పెద్ద వ్యవధి ఇవ్వకుండానే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్లీ విచారణకు రావాలసి ఆదేశించారంటే  తొలి రోజు విచారణలో తమ ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఈడీ అధికారులు భావించినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు.అసలు తొలి విచారణలో ఈడీ అధికారులు ఏయే అంశాలపై కవితను ప్రశ్నించారన్న విషయంలో ఇటు కవిత నుంచి కానీ అటు ఈడీ వర్గాల నుంచీ కానీ క్లియర్ కట్ సమాచారం లేదు.

 

 

 

 

ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. అయితే రెండో సారి స్వల్ప వ్యవధిలోనే విచారణకురావాల్సిందిగా ఆదేశించడంతో ఈ సారి కవిత ఆర్థిక మూలాల విషయంలో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉందనిఅంటున్నారు. అందుకే ఈ నెల 16న విచారణకు పలు డాక్యుమెంట్లను తీసుకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కవితను ఆదేశించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి సౌత్ గ్రూపు నుంచి ఆప్ నేతలకు అందినట్లుగా చెబుతున్న రూ. వంద కోట్ల రూపాయల ముడుపుల విషయంలో కవిత నుంచి వివరాలు రాబట్టడమే లక్ష్యంగా ఈనెల 16న ఈడీ అధికారుల విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 

 

 కల్వకుంట్ల కవిత ఆదాయ వివరాలు, వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నందున వాటి ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు తీసుకురావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు ఆమెను ఆదేశించారని చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో  ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి తీసుకున్న  వాంగ్మూలాలకు అనుగుణంగా కవిత నుంచి వివరాలు రాబట్టిన ఈడీ అధికారులు..  కస్టడీలో ఉన్న పిళ్లయ్, మనీశ్ సిసోడియా వెల్లడించే అంశాల ఆధారంగా కవితను ఈ నెల 16న విచారించే అవకాశాలున్నాయంటున్నారు.  పిళ్లయ్ కస్టడీ సోమవారం తో ముగియనుండగా,  సిసోడియా కస్టడీ ఈ నెల 17న ముగియనున్నది.
Tags;ED cases turning into headaches
Continue Reading
Post Midle
ED cases turning into headaches
TM-Team 13274 posts 0 comments

Prev Post

ఫాంకేసు ఎదురుతిరుగుతోంది…

Next Post

వివాదస్పదంగా ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రవర్తన

You might also like More from author
Telangana

ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు

Telangana

గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంపై కేంద్రానికి నోటీసులు –

Telangana

జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

Telangana

బతికున్న నన్ను చంపెయ్యకండి’  సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన

Telangana

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీ

Telangana

ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ అమలు చేయాలి

Prev Next
More Stories

ఈడీ దర్యాప్తు అధికారికి కవిత లేఖ

Mar 21, 2023

అమ్మవారి ఆలయంలో చేయి చేసుకున్న వ్యక్తి

Mar 21, 2023

కాంగ్రెస్ లో వర్గపోరు

Mar 21, 2023
Prev Next 1 of 339
  • Home
  • Andhra
  • Political
  • Crime
  • సినిమా
    • photo gallery
    • హీరొయిన్స్
© 2017 Telugu Muchatlu- All Rights Reserved.
Website Design: SSIT-8143363500
You cannot print contents of this website.
 

Loading Comments...