Natyam ad

మాగుంట నివాసంలో ఈడీ సోదాలు

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో లోని పటేల్ రోడ్డు లోని వైకాపా ఎంపి  మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం లో ఈ డి సోదాలు కొనసాగాయి. నెల్లూరులో ఈడి(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ డి హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వస్తున్నారు. దీనిలో భాగంగా  నెల్లూరు నగరం లో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి  కార్యాలయం లోనూ ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తూ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంట్లోంచి ఎవరినీ బయటికి రానీయ కుండా బయటి వారిని లోపలకు పోకుండా కఠినంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

 

Tags:ED searches Magunta’s residence

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.