Natyam ad

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

అమరావతి ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం సైతం సోదాలు చేపట్టింది. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్‌లతో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్‌ ఎంబీఎస్‌ జ్యువెలరీలో ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే తనిఖీలు చేపట్టారు.ఎంబీఎస్‌ జ్యువెలరీ బ్యాంకు లావాదేవీలు, వాల్యూయేటర్‌ ద్వారా గోల్డ్ వంటి వాటిపై సోదాలు చేపట్టారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్‌ జ్యువెలరీ షోరూముల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
మరోవైపు.. విజయవాడలోనూ ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బిగ్‌సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) తనిఖీలు చేపట్టింది. హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు తనిఖీ చేశారు ఐటీ అధికారులు. హానర్‌ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది.

 

Post Midle

Tags: ED searches ongoing in Telugu states

Post Midle