బాలికను డ్రగ్స్ కు ఎడిక్ట్ చేసి…

Date:04/01/2020

భోపాల్ ముచ్చట్లు:

13 సంవత్సరాల మైనర్ బాలికను డ్రగ్స్‌కు బానిసగా మార్చి.. ఆమె శరీరాన్ని పుండుగా మార్చారు కొందరు కామాంధులు. మాదకద్రవ్యాలకు బానిసైన ఆ బాలికకు డ్రగ్స్ ఇవ్వాలంటే సెక్స్‌లో పాల్గొనాలంటూ వాడుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భోపాల్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు తల్లి చనిపోయింది. తండ్రి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో బాలిక నానమ్మ వద్ద ఉంటోంది. అయితే 6 నెలల క్రితం బాలికకు ఓ యువకుడు గంజాయితో కూడిన సిగరెట్ అలవాటు చేశాడు. అప్పటి నుంచి ఆమె మత్తుకు బానిసగా మారింది.దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు యువకులు బాలికను లైంగికంగా వాడుకున్నారు. డ్రగ్స్ కోసం ఎంతకైనా దిగజారేలా బాలిక తయారైంది. దీంతో కొందరు యువకులను మాదకద్రవ్యాలు అడిగ్గా తమతో సెక్స్ చేస్తేనే డ్రగ్స్ ఇస్తామని చెప్పారు. అలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు యువకులతో రోజూ బాలిక సెక్స్‌లో పాల్గొనేది. బాలిక డ్రగ్స్ బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు దారుణంగా లైంగికంగా వాడుకున్నారు.అయితే కొన్ని రోజులుగా మనవరాలి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుండటంతో నానమ్మకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె బాలల సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న అధికారులు బాలికను విచారించారు. చైల్డ్ లైన్ సిబ్బంది బాలికను బుజ్జగించి అసలు విషయం రాబట్టారు. గత 6 నెలల కాలంలో జరిగిన దారుణం మొత్తాన్ని బాలిక కళ్లకుగట్టినట్టు వివరించింది. తన శరీరంతో యువకులు ఆడుకున్నారని విలపించింది. దీనిపై చైల్డ్ లైన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

వైకాపా నిర్ణయాన్ని సమర్ధించిన జనసేన ఎమ్మెల్యే

 

Tags:Editing a Girl to Drugs …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *