కాంగ్రెస్ నేతపైనే ఈడీ కన్ను-ఎమ్మెల్యే సీతక్క
హైదరాబాద్ ముచ్చట్లు:
సావర్కర్, గాడ్సే ల వారసులు గాంధీ వారసులను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులపైనే ఈడీ కన్ను. ఈడీ బీజేపీ అనుబంధ సంస్థ లాగే కనిపిస్తోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం నాడుగాంధీ భవన్ లో జరిగిన సత్యాగ్రహం కార్యాక్రమంలో ఆమె మాట్లాడారు. దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల ఈడీ కళ్ళు మూసుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని దోచుకుంటున్నట్టు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారు. ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తున్నారు. బీజేపీ, దాని తోత్తు టీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు.
Tags:ED’s eyes on the Congress leader – MLA Sitakka

