ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన

Education in English medium

Education in English medium

Date:08/11/2019

విజయవాడ ముచ్చట్లు:

వచ్చే విద్యా సంవత్సరంలో ఓకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఏపీలో పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రియాక్ట్ అయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 81 జీవో వల్ల మాతృభాష తెలుగు.. మృత బాషగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయమని ఆయన ఎద్దేవా చేశారు.తెలుగు మాధ్యమం రద్దుకు అప్పుడు చంద్రబాబు ప్రయత్నిస్తే ఇప్పుడు జగన్ ప్రయత్నం చేస్తున్నారు.ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని అనేక మంది మేధావులు చెబుతుంటే ఎవ్వరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.పక్కరాష్ట్రలో మాతృభాష కోసం చట్టాలు చేస్తుంటే.. మన రాష్ట్రంలో మాతృభాషను చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జీవో వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పారు.

 

వక్ఫ్ బోర్డు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఆసాద్‌అహమ్మద్‌

 

Tags:Education in English medium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *