విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

పుంగనూరు ముచ్చట్లు:

 

విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా సమగ్రశిక్ష ఏఎల్‌ఎస్‌వో అజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నేను బడికిపోతా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇస్లాంనగర్‌, నక్కబండ ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడిఈడు పిల్లలను పనిలో కాకుండ బడిలో ఉంచాలని సుదుద్ధేశంతో నేను బడికిపోతా కార్యక్రమాన్ని అట్టహసంగా నిర్వహిస్తోందన్నారు. బడిఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అయితే పుంగనూరు పట్టణంలో కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు బడిఈడు పిల్లలను చింతకాయ బట్టిలు, ఇటుక బట్టిల వద్ద కూలీ పనులకు పంపడం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుందన్నారు. నేను బడికి పోతా కార్యక్రమ ర్యాలీని పట్టణ పురవీధుల్లో నిర్వహించి, బడిఈడి పిల్లలను పనిలో కాదు బడిలో ఉండాలని నినాదాలు చేస్తూ ఊరేగారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్డెన్నశెట్టి, ఉపాధ్యాయులు సురేంద్రబాబు, ఆసాద్‌, ఐసిడిఎస్‌ సిబ్బంది కల్పన, సీఆర్‌పిలు శ్రీనివాసులు, నారాయణస్వామి, అబ్ధుల్‌లతిఫ్‌, మీనాక్షి , ఆంజమ్మ, మంజుల, వెంకట్రమణ , తేజ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Education is a bright future

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *