చదువు అభివృద్దికి బాటలు వేస్తుంది-మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని అంబేద్కర్ కాలనీ లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గోన్నారు. అక్కడ అయన పిల్లలకు అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చదువు వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి దోహదం చేస్తుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. సామాజిక గౌరవాన్ని కలిగిస్తుంది. చదువు ఒక్కటే మనిషిని సమున్నతంగా తీర్చిదిద్దుతుంది. అందరూ చదువుకోవాలి. బాగా అభివృద్ధిలోకి రావాలి. సీఎం కెసిఆర్ కూడా తెలంగాణలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మన ఊరు మన బడి కింద 7,289 కోట్ల తో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం లోకి మారుస్తున్నారు. అనేక ఆశ్రమ పాఠశాలలు పెట్టీ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నరు. విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకం పెట్టీ పేద విద్యార్థులను చదివిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ వాసులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags: Education paves the way for development-Minister Errabelli

