పుంగనూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఉప్యాధి పనులు
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన అన్ని రకాల పనులు ఉపాధిహామి ద్వారా నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని బండ్లపల్లె గ్రామంలో ఉప్యాధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో పనులు, గూర్చి చర్చించారు. కూలీల సమస్యల గూర్చి తెలుసుకున్నారు. ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధిహామి పథకంలో ఉన్న సమస్యలను గుర్తించి రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిపి పరిష్కరిస్తామన్నారు. పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కూలీలకు అవసరమైన పనులు చేపట్టాలని , వేసవిలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండ చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, ఏపీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags; Education works in rural areas in Punganur
