పోలీసు ఉద్యోగాలకు ధృవపత్రాల పరిశీలన ప్రారంభం

Date:14/06/2019

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు సంబంధిత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ధృవ పత్రాల పరిశీలన శుక్రవారం ఉదయం నుండి పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభమైంది. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరిశీలన కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో సీరియల్ నంబర్ల వారీగా నిర్వహించనున్నట్లు అదనపు ఎస్.పి.  ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ధృవ పత్రాల పరిశీలన సందర్భంగా,రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వారు జారీ చేసిన ఇంటిమేషన్ లెటర్ లో సూచించిన విధంగా తగిన పత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని, ఎటువంటి ఆందోళన చెందకుండా, పోలీసు అధికారులు
సూచించిన విధంగా అభ్యర్థులు నడుచుకోవాలని అధికారి తెలిపారు. ఏరోజుకారోజు అభ్యర్థుల ధృవ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలన గావించిన తదుపరి సంబంధిత అధికారులు తగిన సూచనలు చేస్తారని వివరించారు. అభ్యర్థుల పలు సందేహాలను అదనపు ఎస్.పి. నివృత్తి చేస్తూ, రిక్రూట్మెంట్ బోర్డు వారు జారీ చేసిన ఇంటిమేషన్ లెటర్ లో పూర్తి వివరాలు ఉంటాయని, ఒకటిరెండుసార్లు శ్రద్ధగా చదవాలని అభ్యర్థులకు సూచించారు. ధృవ పత్రాల పరిశీలన ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు ఎస్.పి. తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి.లు  బి.భాస్కర్, జి.గిరిబాబు,
ఏ.ఓ. కృష్ణమోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ దిలీప్ ఇతర అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

కాల్వల భూ సేకరణలో వేగం పెంచాలి

 

Tags: Examination of the certificates for police jobs

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

బెంగళూర్ లో జీతాలు ఎక్కువ 

Date:29/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఎవరైనా అధిక వేతనం లభించే ఉద్యోగాన్ని కోరుకుంటారు. అయితే అన్ని చోట్ల ఒకే రకమైన జీతం లభించదు. నగరం ప్రాతిపదికన వేతనం మారుతూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ జీతం వస్తుందో.. అక్కడికే ఉద్యోగుల ఉపాధి కోసం వెళ్తుంటారు. మన దేశంలో ఎక్కువ వేతనం అందించే నగరం బెంగళూరు. వేతనాల్లో బెంగుళూరు భేష్ అని తేలింది. ఈ నగరంలో ఉద్యోగులు సగటున ఏడాదికి ఉద్యోగులు 10.8 లక్షల జీతం (సీటీసీ) తీసుకుంటున్నారు. రాండ్‌స్టాండ్ ఇన్‌సైట్స్ తాజా నివేదిక ప్రకారం.. బెంగళూరు హైయెస్ట్ పేయింగ్ సిటీగా అవతరించింది. దీని తర్వాతి స్థానంలో పూణే ఉంది. ఇక్కడ ఉద్యోగుల రూ.10.3 లక్షల వేతనం అందుకుంటున్నారు. ఇక దీని తర్వాతి స్థానం ఢిల్లీది. ఇక్కడి ఉద్యోగులు రూ.9.9 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఇక ఈ మూడు నగరాల తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ఇ్కడి ఉద్యోగులు రరూ.9.2 లక్షల వేతనం అందుకుంటున్నారు. చివరిలో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా ఉన్నాయి.హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లోని ఉద్యోగులకు ఎక్కువ వేతనం లభిస్తోంది. కన్సూమర్ గూడ్స్, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. 6 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వారు ఎక్కువ వేతనాలను అందుకుంటున్నారు.
Tags: In Bangalore the salaries are higher

నిరుద్యోగులకు నిరాశ

Date:29/12/2018
విజయవాడ ముచ్చట్లు:
కోచింగ్‌ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ పుస్తకాలతో కుస్తీలు పడుతున్న నిరుద్యోగులకు నిరాశ కనిపిస్తోంది.  రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఎస్‌ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకటి ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది.. ఉద్యోగం వచ్చేవరకూ ఒకదానివెంట మరొకటి పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతుంటారు. అటువంటి సమయంలో రెండుమూడు ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే రోజు జరిగితే వారి ఆందోళన వర్ణణాతీతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా…అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక  లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది. అసలే నియామకాలు తక్కువ
Tags; Disappointment for unemployed

ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న..   డీఎస్సీ షెడ్యూల్ విడుదల

Date:25/10/2018
అమరావతి ముచ్చట్లు:
ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 9 గంటలకు షెడ్యూల్ను ప్రకటించిన మంత్రి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ సారి టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తామని ప్రకటించారు. అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబరు 1 నుంచి దరఖాస్తులను స్వీకరణ మొదలవుతుందని తెలిపారు. డిసెంబరు 6 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు 29 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 7,676 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలే అధికంగా ఉన్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్లకు అవకాశం కల్పిస్తున్నందున వీటికి పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది.
ఆన్లైన్ విధానంలోనే రాత పరీక్షను నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. డిసెంబరు 6, 10 న స్కూల్ అసిస్టెంట్లకు, డిసెంబరు 11న ఎస్ఏ (లాంగ్వేజెస్), డిసెంబరు 12, 13 తేదిల్లో పీజీటీలకు పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 14, 26న టీచర్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్ పోస్టులకు, డిసెంబర్ 17 పీఈటీ, మ్యూజిట్, క్రాప్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు ఎస్జీటీ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. నవంబరు 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాలను ఎంపికచేసుకునే అవకాశం కల్పిస్తారు.
నవంబరు 17 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాల్లో 4,341, మున్సిపల్ పాఠశాలల్లో 1,100, ఆదర్శ పాఠశాలల్లో 909, బీసీ సంక్షేమ శాఖలో 300, గిరిజన సంక్షేమ శాఖలో 800లతో సహా మొత్తం 7,657 పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు 1,625, లాంగ్వేజ్ పండిట్స్ 452, ఎస్జీటీలు 3,666 ఉన్నాయి. అభ్యర్థులకు వయోపరిమితి కూడా రెండేళ్ల సడలింపు ఇస్తున్నట్టు తెలిపారు.
దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గరిష్టంగా 49 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి జులైలోనే డీఎస్సీ నోటిిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా అప్పట్లో ప్రకటించారు. కానీ రేషలైజేషన్ పేరుతో కొన్ని పోస్టులను తొలగించారు.
స్కూల్ అసిస్టెంట్లకు డిసెంబరు 12, పీజీటీలకు డిసెంబరు 14న, పీఈటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ విభాగాలకు డిసెంబరు 18 న, టీజీటీ, ప్రిన్సిపాల్ డిసెంబరు 28, ఎల్పీటీలకు డిసెంబరు 28, సెకెండరీ గ్రేడ్ పోస్టులకు జనవరి 3 న కీ విడుదల చేస్తారు. వీటిపై అభ్యంతరాలను గడువు కీ విడుదలైన రెండు రోజుల వరకు స్వీకరిస్తారు. ఆయా పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తారు. తర్వాత రెండు రోజుల్లో మెరిట్ జాబితా, ఇది ప్రకటించిన రెండు రోజుల్లో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటిస్తారు.
నోటిఫికేషన్ షెడ్యూల్
డీఎస్సీ నోటిఫికేషన్ ఫీజు చెల్లింపు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం దరఖాస్తు గడువు పరీక్షా కేంద్రాల ఎంపిక ఆన్లైన్ మాక్ టెస్ట్ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్
అక్టోబరు 26 నవంబరు 1 నుంచి 15 వరకు నవంబరు 1 నవంబరు 16 నవంబరు 19 నుంచి 24 వరకు నవంబరు 17 నవంబరు 29 నుంచి
పరీక్షల షెడ్యూల్
ఎస్ఏ (నాన్-లాంగ్వేజెస్) ఎస్ఏ (లాంగ్వేజెస్) పీజీటీ టీజీటీ, ప్రిన్సిపాల్ పీఈటీ, ఆర్ట్స్,
మ్యూజిక్, క్రాఫ్ట్స్ లాంగ్వేజ్ పండిట్స్ ఎస్జీటీ
డిసెంబరు 6, 12 డిసెంబరు 11 డిసెంబరు 12, 13 డిసెంబరు 14, 26 డిసెంబరు 17 డిసెంబరు 27 డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు
 కీ, తుది కీ, ఫలితాలు
విభాగం ప్రాథమిక కీ విడుదల అభ్యంతరాల స్వీకరణ తుది కీ ఫలితాలు మెరిట్ లిస్ట్ ప్రాథమిక ఎంపిక జాబితా
ఎస్ఏ (లాంగ్వేజెస్, నాన్-లాంగ్వేజెస్) డిసెంబరు 12 డిసెంబరు 12 నుంచి 14 వరకు డిసెంబరు 18 డిసెంబరు 20 డిసెంబరు 22 డిసెంబరు 24
పీజీటీ డిసెంబరు 14 డిసెంబరు 14 నుంచి 16 డిసెంబరు 20 డిసెంబరు 22 డిసెంబరు 24 డిసెంబరు 26
పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ డిసెంబరు 18 డిసెంబరు 20 వరకు డిసెంబరు 22 డిసెంబరు 24 డిసెంబరు 26 డిసెంబరు 28
టీజీటీ, ప్రిన్సిపాల్ డిసెంబరు 27 డిసెంబరు 27 నుంచి 29 జనవరి 2 జనవరి 4 జనవరి 6 జనవరి 8
లాంగ్వేజ్ పండిట్ డిసెంబరు 28 డిసెంబరు 28 నుంచి 30 జనవరి 3 జనవరి 5 జనవరి 7 జనవరి 9
సెకెండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) జనవరి 3 జనవరి 3 నుంచి 6 వరకు జనవరి 10 జనవరి 12 జనవరి 14 జనవరి 16
Tags: DSC scheduling has been released for a long time

డిప్లమా అప్రంటీస్‌ ఉద్యోగాలకు ధరఖాస్తు చేయండి

Date:26/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో ఒక్క సంవత్సరం డిప్లమా అప్రంటీస్‌ ఉద్యోగాలకు నిరుద్యోగులు ధరఖాస్తు చేయాలని బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు.ప్రభుత్వాదేశాల మేరకు సివిల్‌ ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ నందు డిప్లమా 2016 సంవత్సరం నందు పొందిన అభ్యర్థులు అర్హులన్నారు. దూరవిద్యా ప్రాతిపదికన చదివిన వారు అనర్హులన్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్‌ 5 లోపు ధరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలని కోరారు. ఆన్‌లైన్‌ డబ్ల్యూడబ్యూజ్లిడబ్యూజ్లి.డిటిసిపి.ఏపి.జివోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో ధరఖాస్తులు పంపాలన్నారు.

ఆధార్…ఆధారమే కుండ బద్దలు కొట్టిన సుప్రీం కోర్టు

Tags: Apply for Diploma Apprentices Jobs

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త…

Date:30/04/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు….
ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ పోస్ట్ లు….
యువతి/యువకులకు IAF లో
ఆఫీసుర్లు గా చేరుటకు సువర్ణ అవకాశం
Posts:- Officers-Flying
అర్హత:-Any Degree/BTech
Posts:- Ground Duty-Ad
అర్హత:-Any DEGREE
Posts:- Ground Duty-Log
అర్హత:-Any DEGREE
Posts:- Ground Duty-Acc
అర్హత:-B-Com
Posts:- Ground Duty-Ed
అర్హత:- Any PG/ M.A, MSc, MBA, MCA
డిగ్రీ /పిజి విద్యార్థులు. /
ఫైనల్ ఇయర్ విద్యార్థులు 01-07-2018 లోపు
విద్యాఅర్హతలు పూర్తి చేయువారు కూడా అప్లై చేయవచ్చు..
జీత భత్యాలు;-
– Flying Branch:-Rs. 85,372/-
-Ground Duty(Tech):-Rs. 74,872/-
-Ground (Non-tech):-Rs. 71,872/-
ఇతర వివరాలు;-
http://shamsh.in/indian-air-force-recruitment-2017/.
దయచేసి ఈ మెస్సేజ్ మీకు అవసరం లేకపోతె
ఎవరికైనా తెలిసిన వాళ్లకి పంపగలరు.

 

Tags: Good news for graduate students …

టెట్‌ను వాయిదా వేయాలని నిరుద్యోగుల డిమాండు

Date:23/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో టెట్‌ను వాయిదా వేయాలని డిమాండు చేస్తూ పట్టణంలోని ఆర్‌ఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. 60 మార్కులు ఉన్న సోషియల్‌ స్టడిస్‌ను తీసివేసి , 60 మార్కులు హిందికి పెట్టడం బాధకరమన్నారు. హిందీలో కంటెంట్‌, హిందీ, సాహిత్యము, డిగ్రీ వరకు పెట్టడంఙరిగిందన్నారు. పరీక్షల షెడ్యూల్డ్లో మార్పులు లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమైంది. దీనిపై టెట్‌ను వేయాలని డిమాండు చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంఈవో లీలారాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్‌, ఎం.బాబు, శ్రీధర్‌, స్వర్ణలత, పుణ్యవతి, రజిత, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags : Demand for unemployed to postpone Tate